సైన్యాధిపతి పదవీకాలం నెలపాటు పొడిగింపు

సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో జూన్‌ 30 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.

Published : 27 May 2024 05:51 IST

దిల్లీ: సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెలపాటు పొడిగించింది. దీంతో జూన్‌ 30 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. క్యాబినెట్‌ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపినట్లు వివరించింది. ఈ తరహా పొడిగింపు చాలా అరుదు. మనోజ్‌ పాండే.. 2022 ఏప్రిల్‌ 30న సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ పొందాల్సి ఉంది. సైన్యాధిపతి సర్వీసును ప్రభుత్వం పొడిగించిన ఘటన 1970ల ఆరంభంలో జరిగింది. నాటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జి.జి.బెవూర్‌కు ఏడాది పాటు పొడిగింపు దక్కింది. దీనివల్ల.. ఆ తర్వాతి స్థానంలో ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రేమ్‌ భగత్‌ సైన్యాధిపతి పదవిని చేపట్టకుండానే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సీనియార్టీ ప్రకారం చూస్తే ప్రస్తుతం మనోజ్‌ పాండే తర్వాతి స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎం.వి.సుచీంద్ర కుమార్‌ ఉన్నారు. ఆయన సైనిక ఉపప్రధానాధికారిగా పనిచేస్తున్నారు. మరోవైపు పాండే పదవీకాలాన్ని పొడిగించడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. సైనిక దళాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని