నిందితుడి రక్త నమూనా నివేదికను మార్చేసిన వైద్యులు

మహారాష్ట్రలోని పుణెలో మైనర్‌ దురుసు డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్‌ రక్త నమూనా పరీక్ష నివేదికను డబ్బులకు ఆశపడి ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు దర్యాప్తు అధికారులు సోమవారం గుర్తించారు.

Published : 28 May 2024 04:38 IST

పుణె కారు ప్రమాదం కేసులో అవినీతి కోణం 

పుణె: మహారాష్ట్రలోని పుణెలో మైనర్‌ దురుసు డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అవినీతి కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్‌ రక్త నమూనా పరీక్ష నివేదికను డబ్బులకు ఆశపడి ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు దర్యాప్తు అధికారులు సోమవారం గుర్తించారు. రక్త పరీక్షల సమయంలో మైనర్‌ నమూనాలను చెత్తబుట్టలో పారేసి.. మరో వ్యక్తి నమూనాలను పెట్టినట్లు పోలీసులు తెలిపారు.  సాసూన్‌ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం అధిపతి డాక్టర్‌ అజయ్‌ తావ్‌రే, ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ శ్రీహరి హల్నోర్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపిన పుణె క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. వీరితో పాటు డాక్టర్‌ తావ్‌రే దగ్గర పనిచేసే అతుల్‌ ఘట్కాంబ్లే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి ఈనెల 30 వరకు రిమాండు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని