బద్రీనాథ్‌ దర్శనం లేకుండానే.. 650 మందికి పైగా భక్తులు వెనక్కి

పేర్లు నమోదు చేసుకోకుండా చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు.

Published : 29 May 2024 03:52 IST

గోపేశ్వర్‌(ఉత్తరాఖండ్‌): పేర్లు నమోదు చేసుకోకుండా చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులను దర్శనానికి అనుమతించకుండా అధికారులు వెనక్కు పంపించారు. తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ నిబంధనను పాటించకుండా 650 మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌కు వెళుతుండగా.. గౌచార్‌ చెక్‌పోస్ట్‌ నుంచే వారిని వెనక్కు పంపించినట్లు చమోలీ ఎస్‌ఎస్‌పీ కార్యాలయం మంగళవారం తెలిపింది. యాత్ర ప్రారంభ రోజుల్లో నెలకొన్న గందరగోళం దృష్ట్యా రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను తీసుకొచ్చిన దాదాపు 120 వాహనాలను కూడా తిప్పి పంపించామని, అయిదు వాహనాల నిర్వాహకులపై చర్యలు సైతం తీసుకున్నామని వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకోకుండా యాత్రకు రావొద్దని, రిజిస్ట్రేషన్‌లో తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే భక్తులు రావాలని ఉత్తరాఖండ్‌ సీఎస్, డీజీపీ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని