రాధికా సేన్‌కు ఐరాస అవార్డు

డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్‌ రాధికా సేన్‌ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2023)తో సత్కరించనుంది.

Published : 29 May 2024 05:06 IST

ఐరాస: డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్‌ రాధికా సేన్‌ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2023)తో సత్కరించనుంది. మే 30న ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించనున్నారు. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్‌ సుమన్‌ గవానీ అందుకోగా, రెండోసారి మేజర్‌ రాధికాసేన్‌ అందుకోనున్నారు. 

విధి నిర్వహణలో బలిదానం చేసిన శాంతి రక్షకులకు ‘అంతర్జాతీయ ఐరాస శాంతి రక్షకుల దినోత్సవం’ సందర్భంగా ఈ నెల 30న డ్యాగ్‌ హామర్‌ షోల్డ్‌ పతకాలను ప్రదానం చేయనున్నట్లు సమితి ప్రకటించింది. ఈ పతకాలను పొందే 64 మంది సైనిక, పోలీసు, పౌర శాంతిరక్షకులలో భారతీయ జవాన్, దివంగత నాయక్‌ ధనంజయ్‌ కుమార్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఆయన సమితి శాంతిరక్షక సేన సభ్యుడిగా కాంగోలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని