నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా

దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండటంతో తాగునీటి కొరత తలెత్తకుండా దిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Published : 30 May 2024 05:12 IST

దిల్లీ సర్కారు నిర్ణయం

దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండటంతో తాగునీటి కొరత తలెత్తకుండా దిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా విధించనున్నట్లు బుధవారం మంత్రి అతిశీ ప్రకటించారు. పైపులతో కార్లను కడగడం, వాటర్‌ ట్యాంకులు ఓవర్‌ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం దిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని దిల్లీ జల్‌బోర్డు సీఈవోకు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. హరియాణా నుంచి హక్కుగా తమకు రావాల్సిన యమునా నది నీటి విడుదల ఆలస్యం అవుతుండటంతో దిల్లీ ప్రజలకు ఇబ్బందిగా మారుతోందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి విడుదలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని