సిసోదియాకు సుప్రీంలో చుక్కెదురు

మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీలు తనపై పెట్టిన కేసులలో బెయిలు కోసం దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పెట్టిన దరఖాస్తులను స్వీకరించడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.

Updated : 05 Jun 2024 07:33 IST

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీలు తనపై పెట్టిన కేసులలో బెయిలు కోసం దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా పెట్టిన దరఖాస్తులను స్వీకరించడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిసోదియా అక్రమ ధన చలామణికి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ, ఈడీలు పెట్టిన కేసులవి. ఈ కేసుల్లో ఈడీ తుది ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు చేశాక, సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన తరవాత సిసోదియా బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీం వెసులుబాటు కల్పించింది. ఈడీ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు ఛార్జిషీటుకు సమానం. వీటిని జూలై 3వ తేదీకల్లా ఈడీ, సీబీఐలు దాఖలు చేస్తాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు. సిసోదియా 15 నెలల నుంచి కస్టడీలో ఉన్నా ఈడీ, సీబీఐల దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదనీ, అందుకే ఆయనపై ఉన్న కేసుల్లో విచారణ ఇంకా మొదలు కాలేదని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. అందువల్ల సిసోదియాకు బెయిలు ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని