అరుణాచల్‌లో అపూర్వమైన చీమలు

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు.

Published : 05 Jun 2024 07:22 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్‌ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్‌ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్‌ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్‌ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు. మొత్తం 16,724 చీమజాతుల్లో నీలి రంగు చీమలు అత్యంత అరుదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని