మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా దిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌లో ఆయన ఓ మొక్కను నాటారు.

Published : 06 Jun 2024 05:27 IST

దిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా దిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌లో ఆయన ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద మొక్కను నాటి ఆ ఫొటోలను ఆన్‌లైన్‌లో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘సుస్థిర జీవన విధానాలు, ప్రకృతిమాత రక్షణ కోసం మనకున్న నిబద్ధతలో భాగంగా ఈరోజు ఉదయం మొక్కను నాటాను. మన భూమిని మరింత మెరుగుపరిచేందుకు మీ అందరి సహాకారం అందించాలని కోరుతున్నాను. గత పదేళ్లలో చేసిన సమష్టి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతాల విస్తీర్ణం పెంచాయి. దీనిలో స్థానిక సంస్థలు ముందుడడం అభినందనీయం’ అని ఎక్స్‌ వేదికగా మోదీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు