విలువల కొనసాగింపు భావనను న్యాయమూర్తులు ప్రతిబింబిస్తారు

భారతదేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య ప్రధాన అంశంగా ఎన్నికలు ఉన్నప్పటికీ.. వ్యవస్థను పరిరక్షించే రాజ్యాంగ విలువల కొనసాగింపు భావనను న్యాయమూర్తులు ప్రతిబింబిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Published : 06 Jun 2024 05:33 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

ఆక్స్‌ఫర్డ్‌: భారతదేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య ప్రధాన అంశంగా ఎన్నికలు ఉన్నప్పటికీ.. వ్యవస్థను పరిరక్షించే రాజ్యాంగ విలువల కొనసాగింపు భావనను న్యాయమూర్తులు ప్రతిబింబిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. సమాజంలో న్యాయనిర్ణేతలు పోషించగల మానవీయ పాత్ర అంశంపై ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ సొసైటీని ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావడంలో సాంకేతికత పోషిస్తున్న పాత్రను కొనియాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర. సంప్రదాయం, మంచి సమాజం భవిష్యత్తు ఏమిటన్న భావనలను ప్రతిబింబిస్తుంది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని