ఈవీఎంల విశ్వసనీయత నిరూపితమైంది

ఈవీఎంల విశ్వసనీయతను నేను తొలి నుంచి గట్టిగా సమర్థిస్తూ వచ్చాను. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేయలేదు.

Updated : 06 Jun 2024 08:25 IST

ఈవీఎంల విశ్వసనీయతను నేను తొలి నుంచి గట్టిగా సమర్థిస్తూ వచ్చాను. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేయలేదు. నా వాదన నిరూపితమైనందుకు సంతోషంగా ఉంది. ఎన్నికల నిర్వహణలో ఇతర అవసరమైన అంశాల గురించి చర్చించకుండా ఈవీఎంలపై దుష్ప్రచారం చేసేందుకు ఎంతో మంది తమ శక్తిని వృథా చేసుకున్నారు. 

ఎస్‌.వై.ఖురేషి, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి


అంధ భక్తులతో చేటే..

నం చేసే ప్రతి పనికీ చప్పట్లు చరిచే అంధ భక్తుల బృందాన్ని మన చుట్టూ పెట్టుకుంటే వచ్చే సమస్య ఏంటంటే, ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు వాళ్లు ఎలాంటి విలువైన సలహాలు ఇవ్వలేరు. అందుకే సహేతుకంగా విశ్లేషించి తప్పొప్పులను తెలియజేసే సన్నిహితులు ఉండాలి. రాజకీయ పార్టీలకైనా, సంస్థలకైనా ఇది వర్తిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు భాజపాపై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. ఆ పార్టీ నేతలు తమ అంధ అభిమానులను పక్కనపెట్టి, ఏం జరిగిందో సమీక్షించుకొని దిద్దుబాటు చేసుకోకపోతే అది శాశ్వత ప్రభావంగా ఉండిపోతుంది.

చేతన్‌ భగత్, రచయిత


భయాన్ని చంపేయండి

యం చాలా చెడ్డది. అది మీలోని సృజనాత్మకతను చంపేసి, మీ ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నిస్తుంది. మీలోని దార్శనికుణ్ని బంధించి, మీ ఆశయాన్ని మీ నుంచి దూరం చేస్తుంది. మీరు దానికి లొంగిపోతే మీ జీవితంలోని ఉత్తమ దశను దోచుకుంటుంది. భయాన్ని చంపకపోతే అది మిమ్మల్ని రోజూ చంపుతుంటుంది. భయాన్ని ప్రగతికి అవకాశంగా మలచుకొంటే మీకు తిరుగుండదు.

రాబిన్‌ శర్మ, రచయిత


ఆహార ధరల పెరుగుదల ఎందుకో ఆలోచించారా? 

హార ధాన్యాలను కొనుగోలు చేస్తున్న ప్రతిసారీ పెరిగిన ధరలను చూసి కలవరపడుతుంటాం. కానీ ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచించారా? అలాగే ఆహార గింజలను పండించే రైతులు పంటలు సరిగా పండక జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుండటం చూసి ఆందోళన చెందుతుంటాం. కానీ ఆ సమస్యకు మూలమేమిటో తెలుసుకొనే ప్రయత్నం చేశారా? వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న తీవ్ర కరవు పరిస్థితులు, భూమి క్షీణత.. పంటలకు, పశుసంపదకు పెను నష్టం చేకూరుస్తుండటమే అందుకు కారణం. సారవంతమైన భూమి తగ్గడం వల్లే ఆహార ఉత్పత్తులు తగ్గి వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ఉపద్రవానికి అడ్డుట్ట వేయాలంటే భూపరిరక్షణ, పునరుద్ధరణే మార్గం. ఆ దిశగా ప్రభుత్వాలతోపాటు ప్రజలూ బాధ్యతాయుతమైన చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతినబూనాలి.

ఐరాస పర్యావరణ కార్యక్రమం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని