15 నుంచి లోక్‌సభ సమావేశాలు!

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 18వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Published : 08 Jun 2024 06:02 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 18వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ప్రధాన మంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్‌ భేటీ అయినప్పుడు పార్లమెంటు సమావేశాల ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకుంటారు. లోక్‌సభలో తొలి రెండు రోజులు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత రోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. దీంతో సమావేశాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ నెల 22 వరకు ఇవి కొనసాగుతాయని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని