‘ఉద్యోగాలకు భూమి’ కుంభకోణంలో లాలూపై సీబీఐ తుది ఛార్జిషీటు

రైల్వేశాఖలో ఉద్యోగ నియామకాలకు బదులుగా భూమిని పొందిన కుంభకోణంలో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు మరో 77 మందిపై సీబీఐ శుక్రవారం తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.

Published : 08 Jun 2024 06:04 IST

దిల్లీ: రైల్వేశాఖలో ఉద్యోగ నియామకాలకు బదులుగా భూమిని పొందిన కుంభకోణంలో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు మరో 77 మందిపై సీబీఐ శుక్రవారం తుది ఛార్జిషీటు దాఖలు చేసింది. వివిధ రైల్వే జోన్లలో ‘ప్రత్యామ్నాయం’గా నియామకాలు పొందిన అనర్హులైన అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబం భూమి పట్టాలు పొందినట్లు సీబీఐ అభియోగం. ఈ కేసులో విచారణ ముగింపు సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ మూడవది అయిన తుది ఛార్జిషీటును ప్రజాప్రతినిధుల కోర్టుకు సమర్పించింది. ఇందులో లాలూతోపాటు ఆయన భార్య రబ్డీ దేవి, కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్, కుమార్తె హేమా యాదవ్, మాజీ ఓఎస్డీ భోలా యాదవ్, గతంలో లాలూ సిబ్బందిగా పనిచేసినవారిలో ఒకరు.. ఇలా మొత్తం 78 పేర్లు ఉన్నాయి. 29 మంది రైల్వే అధికారులు, 37 మంది అభ్యర్థులు, ఆరుగురు ప్రయివేటు వ్యక్తులు సైతం ఇందులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు