కంగనాను చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కు మద్దతుగా రైతు సంఘాల ర్యాలీ

నటి, భాజపా ఎంపీ కంగనారనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌కు మద్దతుగా వివిధ రైతు సంఘాలు ర్యాలీ చేపట్టాయి.

Published : 10 Jun 2024 05:15 IST

దిల్లీ: నటి, భాజపా ఎంపీ కంగనారనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌కు మద్దతుగా వివిధ రైతు సంఘాలు ర్యాలీ చేపట్టాయి. పంజాబ్‌లోని మొహాలీలో ఆదివారం సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాతో సహా పలు రైతు సంఘాలు పాదయాత్ర నిర్వహించాయి. మహిళా కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌కు ఎలాంటి అన్యాయం జరగకూడదని, ఈ వ్యవహారంపై న్యాయంగా విచారణ జరిపించాలని రైతులు డిమాండ్‌ చేశారు. చండీగఢ్‌ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ తనపై దాడి చేసి దుర్భాషలాడిందని, ఆమె రైతు నిరసనలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పిందని ఆ రోజే కంగనా ఓ వీడియో ప్రకటన ద్వారా తెలిపారు. అనంతరం మరో వీడియోలో మహిళా కానిస్టేబుల్‌ మాట్లాడుతూ.. గతంలో రైతు నిరసనల సమయంలో ధర్నా చేస్తున్న వారంతా దినసరి కూలీలని కంగనా వ్యాఖ్యానించిందని, ఆ నిరసనకారుల్లో తన తల్లి కూడా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాడి ఘటన అనంతరం మహిళా కానిస్టేబుల్‌పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని