Yogi Adityanath: చిరుత పిల్లకు పాలు తాగించిన యోగి

వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. గోరఖ్‌పుర్‌లోని అష్ఫక్‌ ఉల్లాఖాన్‌ జూలాజికల్‌ పార్క్‌ను సందర్శించారు.

Updated : 07 Oct 2022 08:41 IST

వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. గోరఖ్‌పుర్‌లోని అష్ఫక్‌ ఉల్లాఖాన్‌ జూలాజికల్‌ పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గీత అనే తెల్ల పులిని జంతు ప్రదర్శనశాలలో విడిచిపెట్టారు. రెండున్నర నెలల క్రితం ఈ పులిని ఇక్కడికి తీసుకొచ్చారు. అంతకుముందు యోగి ఓ చిరుత పిల్లకు పాలుపట్టించారు. గోరఖ్‌పుర్‌లోని వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు యోగేశ్‌ సింగ్‌ పర్యవేక్షణలో ఉన్న చిరుత పిల్లను ఒడిలోకి తీసుకొని.. డబ్బాతో పాలు తాగించారు. ఆ చిన్నారి చిరుతకు చండీ అని పేరు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని