కేరళలో పోలీసు స్టేషన్‌పై దాడి

కేరళలోని తిరువనంతపురం జిల్లా విఝింజం పోలీసు స్టేషన్‌పై ఆదివారం దాడి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

Published : 28 Nov 2022 05:32 IST

29 మంది పోలీసులకు గాయాలు

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం జిల్లా విఝింజం పోలీసు స్టేషన్‌పై ఆదివారం దాడి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 29 మంది పోలీసులు గాయపడ్డారు. విఝింజంలో ఆదానీ గ్రూపు నిర్మిస్తున్న ఓడరేవును వ్యతిరేకిస్తూ స్థానికంగా శనివారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అక్కడ ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఓడరేవు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు నిరసనకారులు ఆదివారం రాత్రి విఝింజం పోలీసు స్టేషన్‌కు గుంపుగా వచ్చారు. శనివారం అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడ నిలిపిఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. వాటిలో నాలుగు జీపులు, ఓ మినీ వ్యాను ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిరసనకారులు కర్రలు, ఇటుకలతో దాడి చేయడంతో 29 మంది పోలీసులతో పాటు ఓ పాత్రికేయుడికి గాయాలయ్యాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని