Ragging: ర్యాగింగ్‌కు భయపడి.. రెండో అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి

సీనియర్ల వేధింపులు తట్టుకోలేక, వారి నుంచి తప్పించుకునేందుకు అస్సాంలోని దిబ్రూగఢ్‌ యూనివర్సిటీలో ఆనంద్‌ శర్మ అనే విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు.

Updated : 29 Nov 2022 07:12 IST

దిబ్రూగఢ్‌ వర్సిటీలో ఘటన

సీనియర్ల వేధింపులు తట్టుకోలేక, వారి నుంచి తప్పించుకునేందుకు అస్సాంలోని దిబ్రూగఢ్‌ యూనివర్సిటీలో ఆనంద్‌ శర్మ అనే విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనకు కారణమైనట్లుగా భావిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడిని సీనియర్‌ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా వేధించేవారని బాధితుడి తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి డబ్బులు గుంజుకునే వారని, మొబైల్‌ లాక్కొని హింసించేవారని, కొన్నిసార్లు చంపేందుకూ యత్నించారని తెలిపారు. మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరించే వారని పోలీసులతో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని