పుస్తకాల సంచుల్లో ‘సామాజిక పెడ పోకడ’

కర్ణాటకలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థుల పుస్తకాల సంచులు సామాజికంగా ఆందోళన కలిగించే పెడ ధోరణులను వెల్లడించాయి.

Published : 01 Dec 2022 03:47 IST

కర్ణాటకలోని కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థుల బ్యాగుల్లో గర్భ నిరోధకాలు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: కర్ణాటకలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థుల పుస్తకాల సంచులు సామాజికంగా ఆందోళన కలిగించే పెడ ధోరణులను వెల్లడించాయి. అక్కడ తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లను తీసుకెళ్లడాన్ని ఇప్పటికే అన్ని విద్యా సంస్థలు నిషేధించాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా ఫోన్లు తెస్తున్నారేమోనని బెంగళూరులోని నాగరబావి, చుట్టుపక్కల ఉన్న హైస్కూళ్లలో విద్యార్థుల సంచులను సోదా చేసిన ఉపాధ్యాయులు కంగుతిన్నారు. వాటిలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు, మత్తు కోసం వైటనర్లు లభించాయి. కుప్పలుగా పోగైన ఈ వస్తువులను 8 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంచుల్లోనే గుర్తించడం గమనార్హం. ఇకపై విద్యార్థులను సోదా చేయకుండా వదిలేస్తే సమస్య తీవ్రమవుతుందని కర్ణాటక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం (కామ్స్‌) ఆందోళన వ్యక్తం చేసింది. సమస్య తీవ్రత దృష్ట్యా నగర పరిధిలోని అన్ని విద్యా సంస్థల్లో తక్షణమే తల్లిదండ్రులు, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించింది. గర్భ నిరోధకాలు, సిగరెట్లు, వైట్‌నర్లతో దొరికిన విద్యార్థులకు ఆసుపత్రులలో కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు ప్రత్యేకంగా పది రోజుల సెలవులు ఇచ్చినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ ప్రతినిధి ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని