దక్షిణ కొరియా మహిళా యూట్యూబర్‌కు ముంబయిలో వేధింపులు..

దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్‌ను ముంబయిలో వేధింపులకు గురి చేసిన ఇద్దరు ఆకతాయిలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Published : 02 Dec 2022 04:44 IST

ఇద్దరు యువకుల అరెస్టు

ముంబయి: దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్‌ను ముంబయిలో వేధింపులకు గురి చేసిన ఇద్దరు ఆకతాయిలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు ముంబయి నగరాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూపుతుండగా, ఓ యువకుడు ఆమె చేయి పట్టుకుని తన దగ్గరకు లాక్కునే యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించి వెళ్లిపోతుండగా, అతడు తన స్నేహితుడితో బైక్‌పై వచ్చి ఆమెను అడ్డగించాడు. తన వాహనం ఎక్కాలని బలవంతపెట్టగా ఆమె నిరాకరించింది. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇది పోలీసుల దృష్టికి రావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితుల ఆచూకీని కనిపెట్టారు. 19, 21 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు