ఉదయం 8 లోపు చేయాల్సినవి..

Eenadu icon
By National News Desk Published : 28 Oct 2025 05:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విజయవంతమైన వ్యక్తులు ఉదయం 8 గంటలలోపు పాటించే కొన్ని నియమాలు..

  • తగినంత నీరు తాగడం.
  • వ్యాయామం చేయడం.
  • ప్రాధాన్యాలను పరిశీలించుకోవడం.
  • ధ్యానం చేయడం
  • డిజిటల్‌ అంశాలకు దూరంగా ఉండటం.
  • ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం.

అనుష్క సోహం బథ్వాల్, ఆంత్రప్రెన్యూర్‌ 


మీ చిన్నారులకు మీ సాహచర్యమే ముఖ్యం

మీ చిన్నారులకు మీ ధనం కంటే మీ సాహచర్యమే ఎక్కువ అవసరం. వారికి పెద్దపెద్ద బంగళాలు అక్కర్లేదు. ఆటపాటలు, బుడిబుడి నడకలు, నవ్వులతో కూడిన వారి ఎదుగుదలను చూడటానికి తగినంత కాలం జీవించగలిగే తల్లిదండ్రులు వారికి అవసరం. మీ సంతానానికి మీరు ఇవ్వగల ఉత్తమ వారసత్వం మీరు ఆరోగ్యవంతంగా ఉండటం. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలుపెడదామా?

శ్రద్దే కతియార్, పోషకాహార నిపుణుడు 


మార్పు భయంతో..

ఒకప్పుడు కెమెరాలకు ప్రసిద్ధిగాంచిన కొడాక్‌ సంస్థ సాంకేతికరంగంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకోలేకపోవడంతో వెనుకబడిపోయింది. ఇదొక్కటే కాదు.. ఇలా మార్పుపై భయంతో పలు భారీ సంస్థలు ఉనికిని కోల్పోయాయి. ఈ సూత్రం మనుషులకూ వర్తిస్తుంది. కాలానుగుణంగా పనితీరు, నైపుణ్యాల్లో మార్పు చెందుతుంటేనే మనుగడ, అభివృద్ధి స్థిరంగా ఉంటాయి. లేని పక్షంలో ఎంతటి దిగ్గజాలైనా పరాజితులుగా మిగిలిపోతారు.

డేవిడ్‌ హసర్, పెట్టుబడిదారు


తుంటి ఆరోగ్యం జాగ్రత్త

మన తుంటి ఆరోగ్యం దెబ్బతింటే అది మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా...నీ నిలబడే భంగిమ తీరును మార్చేస్తుంది. నీ చలనశీలతను తగ్గిస్తుంది. నీ అకాల మృత్యుముప్పు అవకాశాలను పెంచుతుంది. ఈ పరిస్థితులు ఎదురుకాకుండా తుంటి సంరక్షణ కోసం ప్రతి 30-60 నిమిషాలకొకసారి లేచి నిలబడి శరీరాన్ని కదిలించండి. అధికబరువును తగ్గించుకోండి. కేజీ అదనపు బరువు తుంటిపై మరో 4 కేజీల బరువు మోపుతుంది. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేయండి. తగిన షూస్‌ను ధరించండి.

మైక్‌ బెహర్, హెల్త్‌ కోచ్‌ 


మాటలు అదుపులో ఉండాలి

మీ నోటి నుంచి ఒక్కసారి మాటలు బయటకు వచ్చాయంటే వాటిని వెనక్కు తీసుకోలేరు. అందుకని వాటిని అదుపులో ఉంచుకోండి. వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల కాఠిన్యంతో మీరు పొందే తృప్తి కంటే మీరు చెల్లించాల్సిన మూల్యం ఎక్కువగా ఉంటుందనేది గుర్తుంచుకోండి. 

రాబర్ట్, రచయిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు