వ్యాయామం తర్వాత వేడినీటి స్నానంతో..

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 05:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వ్యాయామం తర్వాత వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి సుమారు 10 శాతం అదనపు శక్తి సమకూరుతుంది. ఇది సాధారణ వేడినీటి స్నానంతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. ఈ ప్రక్రియలో నీటి ద్వారా శరీరాన్ని తాకే వేడి కారణంగా రక్త ప్రసరణ మెరుగై ఈ ప్రయోజనం లభిస్తోంది. తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. 

రోండా పాట్రిక్, బయోమెడికల్‌ సైన్స్‌ అధ్యయనకర్త 


ఉప్పుతో బీపీ రాదు

ప్పు అధికంగా తీసుకోవడం ద్వారా బీపీ, కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఊబకాయం రాదు.

  • శరీరంలో దీర్ఘకాలంగా అధికస్థాయిలో ఉంటున్న ఇన్సులిన్‌ వల్ల మీ కిడ్నీలు సోడియం, నీటిని నిలిపి ఉంచడం కారణంగా అధిక రక్తపోటు వస్తుంది. 
  • మితిమీరిన చక్కెరలు, శుద్ధి చేసిన పిండిపదార్థాలు తీసుకోవడంతో కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు పెరుగుతారు. ఈ సమస్యలు తలెత్తకుండా చక్కెరలకు, రిఫైన్డ్‌ పిండిపదార్థాలకు స్వస్తిచెప్పి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

ఎలీ జారౌజ్, వైద్యుడు 


ఆడపిల్లల తండ్రులకు శ్రద్ధ ఎక్కువ

డపిల్లల తండ్రులకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుందట. 12 వేల మంది ముఖ్య కార్యనిర్వహణ అధికారులను విశ్లేషించిన ఓ అధ్యయనం ఈ మేరకు పేర్కొంది. తొలిసారిగా అమ్మాయి పుట్టిన తండ్రులు సామాజిక బాధ్యత వ్యవహారాల్లో 10 శాతం అధిక సమయం గడుపుతారు. ముఖ్యంగా సంస్కృతి, పర్యావరణ అంశాల్లో శ్రద్ధ చూపుతారు. మహిళా ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తారు.

ఆడం గ్రాంట్, సైకాలజిస్టు 


విజయం ఐస్‌బెర్గ్‌ వంటిది

వ్యక్తి లేదా సంస్థ సాధించే విజయం సముద్రంలో ఐస్‌బెర్గ్‌ వంటిది. ప్రజలు దాని కొనను మాత్రమే చూస్తారు. ఐస్‌బెర్గ్‌ ఉపరితలం కింద కనిపించని భారీ మంచుకొండ పరిమాణంలాగే విజయం వెనుక వెలకట్టలేని కృషి, త్యాగాలు దాగి ఉంటాయి. అందరికీ అదృష్టంలా కనిపించేది వాస్తవానికి కనిపించని పట్టుదల, ప్రయత్నాల ఫలితం. 

సుత్వెస్కీ, ప్రొఫెసర్‌ 


అవకాడో గింజలు పారేయొద్దు

వకాడో గింజలూ అనేక ఆరోగ్యప్రయోజనాలు అందిస్తాయి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు విశృంఖల కణాలు, వార్థక్యానికి వ్యతిరేకంగా పోరాడతాయి. జీర్ణశక్తిని పెంచి..పేగు ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. చర్మానికి నిగారింపును,  వెంట్రుకలకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంతోపాటు కొన్ని రకాల క్యాన్సర్లను దూరం పెడతాయి. అవకాడో గింజల పొడిని స్మూథీల్లోనూ, టీగాను, యోగర్ట్‌లోనూ వినియోగించుకుని ఈ ఉపయోగాలను పొందొచ్చు.

సిబోబుగింగో జోయెల్, అగ్రి ఇన్‌ఫ్లూయెన్సర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని