Atiq Ahmed: ఉమేశ్‌ హత్యకు ప్లాన్‌ గుడ్డూదే..!

ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో కీలక హంతకుడు గుడ్డూ బంబాజ్‌ కోసం వేట తీవ్రమైంది. అతడు మారు పేర్లతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Published : 27 Apr 2023 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేశ్‌పాల్‌ హత్యకు పథక రచన చేసింది గుడ్డూ ముస్లిం అలియాస్‌ గుడ్డూ బంబాజే అని అధికారులు అనుమానిస్తున్నారు. అతీక్‌, అష్రాఫ్‌ మీడియా ముందు ఈ విషయం చెప్పబోతుండగా హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. వాస్తవానికి వీరిద్దరూ జైల్లో ఉన్న సమయంలో నేర సామ్రాజ్యం పూర్తి గుడ్డూ చేతిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో అతడు రహస్యంగా పలు వ్యాపారాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

గతంలో గుడ్డూను ఇంటరాగేట్‌ చేసిన యూపీ ఎస్టీఎఫ్‌ బృందంలో పనిచేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి రాజేశ్‌ పాండే ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. ఉమేశ్‌ హత్య తర్వాత తప్పించుకొనేందుకు గుడ్డూ సొంత సిండికేట్‌ను వాడుకొనే అవకాశం ఉందన్నారు. అతీక్‌ ముఠాను ఉపయోగించుకొనే అవకాశం లేదన్నారు. గుడ్డూకు సొంతంగా భారీ సిండికేట్‌ ఉందని తెలిపారు. అతడికి యూపీలో చాలా మంది మాఫియా నాయకులతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. 

పేర్లు మార్చుకొని తిరుగుతూ..

గుడ్డూ పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు పేర్లు మార్చుకొంటున్నట్లు అధికారులు గుర్తించారు. బబ్లూ, సురేందర్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ వంటి పేర్లు పెట్టుకొంటున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం తప్పుడు ఐడీ ప్రూఫ్‌లను కూడా వాడుతున్నాడు. ఏప్రిల్‌ 2 నుంచి 13వ తేదీ వరకు అతడు ఒడిశాలోని బార్‌గఢ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ అరెస్టు నుంచి తప్పించుకొన్నాడు. అతడు వాడిన దుస్తులు, ఇతరాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గుడ్డూ ఎవరూ గుర్తించకుండా గడ్డం కూడా పెంచినట్లు అతడి అనుచరుడు రజా ఖాన్‌ పోలీసులకు ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు