Kashmir: ‘గుల్‌మార్గ్‌’లో మంచు బీభత్సం..! విదేశీయుడు మృతి, పలువురు గల్లంతు

జమ్మూ కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఓ విదేశీ పర్యటకుడు మృతి చెందాడు. పలువురు గల్లంతయ్యారు.

Published : 22 Feb 2024 17:06 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని ప్రముఖ పర్యటక కేంద్రం గుల్‌మార్గ్‌ (Gulmarg)లో మంచు చరియలు విరిగిపడిన ఘటన (Avalanche)లో ఓ విదేశీ పర్యటకుడు మృతి చెందాడు. అతడిని రష్యా జాతీయుడిగా గుర్తించారు. మరికొందరు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. అయిదుగురిని కాపాడి, స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆర్మీ, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. దీనికోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

భూతల స్వర్గంలో ఒక మ్యాచ్‌.. కశ్మీర్‌ గల్లీలో సచిన్‌ సందడి

స్థానికుల తోడు లేకుండానే.. విదేశీ పర్యటకులు కొంగ్‌డోరి వాలు ప్రాంతంలో స్కీయింగ్‌ వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా కశ్మీర్‌ను మంచు కమ్మేసింది. హిమపాతం కారణంగా ఎత్తైన ప్రాంతాలతోపాటు లోయలూ మంచుతో నిండిపోతున్నాయి. దీంతో ‘స్కీయింగ్‌’కు పేరుపొందిన గుల్‌మార్గ్‌కు పర్యటకులు వెల్లువెత్తారు. పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని