Delhi: దిల్లీలో 52.3 డిగ్రీలు

వేసవి తీవ్రతతో దిల్లీ నగరం అట్టుడికిపోతోంది. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్‌పూర్‌లో బుధవారం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.

Published : 30 May 2024 05:45 IST

దేశ రాజధాని చరిత్రలో ఇదే అత్యధికం
ఉత్తరాది అంతా భానుడి ఉగ్రరూపం

దిల్లీ: వేసవి తీవ్రతతో దిల్లీ నగరం అట్టుడికిపోతోంది. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్‌పూర్‌లో బుధవారం 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అయితే, దేశంలోనే ఇది అత్యధికమని కొందరు అధికారులు చెబుతుండటం గమనార్హం. రాజస్థాన్‌ నుంచి వచ్చే వేడి గాలులే దిల్లీలో ఈస్థాయి ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఈ హీట్‌ వేవ్‌ల ప్రభావం ఉంటుందనీ, ఇది జూన్‌లోనూ కొనసాగొచ్చని సంబంధిత అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు దిల్లీ ప్రజలు వివిధ మార్గాలను అన్వేషిస్తుండటంతో ఒక్కసారిగా విద్యుత్తు డిమాండ్‌ పెరిగింది. బుధవారం రికార్డు స్థాయిలో వినియోగం 8302 మెగావాట్లకు చేరిందని డిస్కం అధికారులు ప్రకటించారు. మరోవైపు వేడి గాలుల ప్రభావంతో ఆసుపత్రుల్లో రద్దీ అధికమైంది. మంగళవారం ఒక్కరోజే పది మంది వరకు వడదెబ్బ బారిన పడ్డారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. అయితే... సాయంత్రం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో అప్పటివరకు ఉక్కపోతతో ఇబ్బందిపడిన రాజధాని వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వచ్చేదాకా.. కూలీలకు మధ్యాహ్నం 3 వరకు విరామం ఇవ్వాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు