Piyush Goyal: ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు.. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం వేళ పీయూష్ గోయల్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల (Trade Deals) విషయంలో భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదని.. హడావిడి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టంచేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ పలు వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్నారు.
కొవిడ్ (COVID-19) మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతరాయాల తర్వాత 2021లో భారతదేశ వాణిజ్య విధానంలో వచ్చిన మార్పును పీయూష్ గోయల్ (Piyush Goyal) గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఒంటరిగా ఉండకూడదని ప్రపంచ దేశాలతో విశ్వసనీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు ఏర్పురుచుకుంటోందని తెలిపారు. దీనివల్ల సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ విధంగా భారత్ వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉందని.. కానీ ఒత్తిడితో మాత్రం చర్చలు జరపదని స్పష్టం చేశారు.
ఇప్పటికే భారత్‌పై ఉన్న సుంకాల (Tariff)ను అంగీకరిస్తున్నాం కదా అనే కారణంతో మరిన్ని సుంకాలను వేస్తామని బెదిరిస్తే.. ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త మార్కెట్లను వెతుక్కోవాల్సి వస్తుందని పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్‌పై సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
సారనాథ్‌లోని మూలగంధ కుటీ విహారలో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రజాసందర్శనార్థం అందుబాటులో ఉంచారు. - 
                                    
                                        

మగధ్‌లో మహా ఉత్కంఠ!
బిహార్‌లోని మగధ్ ప్రాంతంలో అసెంబ్లీ పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్‌ల మధ్యలో గట్టి పోటీ నెలకొంది. - 
                                    
                                        

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
Air India survivor: ఎయిరిండియా ప్రమాద ఘటలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. - 
                                    
                                        

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
Surat Businessman: తల్లి వర్ధంతి రోజున అన్నదానాలు, వస్త్ర దానాలు నిర్వహిస్తుంటారు. పేదరికంలో ఉండేవారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడమూ చూస్తుంటాం. కానీ సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త బాబూ భాయ్ జిరావాలా కొత్త ఆలోచన చేశారు. - 
                                    
                                        

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు: శశిథరూర్
వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. - 
                                    
                                        

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు సోమవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. - 
                                    
                                        
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
Darshan: అభిమాని హత్యకేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. - 
                                    
                                        

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
Digital Arrests: డిజిటల్ అరెస్టులపై జరిపిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. - 
                                    
                                        

‘అనవసర అంశాలపైనే ప్రసంగాలు’.. ప్రధానిపై ప్రియాంక గాంధీ విసుర్లు!
దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలందరిపై ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ
PM Modi: మహిళజట్టు వన్డే ప్రపంచకప్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. - 
                                    
                                        

మీకు హైకమాండ్ చెప్పిందా: సీఎం మార్పుపై సిద్ధరామయ్య
నాయకత్వ మార్పుపై ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని.. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. - 
                                    
                                        

భారత్ టెక్ పవర్‌హౌస్‌గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. - 
                                    
                                        

బిహార్‌లో గెలుస్తాం.. 18న ప్రమాణం చేస్తాం
బిహార్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పునరుద్ఘాటించారు. - 
                                    
                                        

హత్యలు, అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వశాఖలు
బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఒకవేళ ఇండియా కూటమికి వస్తే.. హత్యలు, అపహరణలు, దోపిడీలకు మూడు మంత్రిత్వ శాఖలను తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణ చేశారు. - 
                                    
                                        

దిల్లీ గాలి కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోండి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. - 
                                    
                                        

దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం
మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మహిళల భాగస్వామ్యంతో పాటు అందరి సమష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. - 
                                    
                                        

వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్‌గా మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రధాని మోదీ భయపడిపోతారని.. ఆయన బడా వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్లాంటివారని లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

పహల్గాంలో కేబుల్ కార్ పనులకు ఎన్ఐయే సుముఖత
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో కేబుల్ కార్ ప్రాజెక్టు చేపట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐయే) ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి తెలిపింది. - 
                                    
                                        

కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది
బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. - 
                                    
                                        

పెయింట్ ది సిటీతో ధంతరీ సుందరీకరణ
ఈటీవీ భారత్: ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరీ నగరంలో జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషను సిబ్బంది ‘పెయింట్ ది సిటీ’ పేరుతో వినూత్న సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 


