terrorists arrested: నలుగురు ఐసీస్‌ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుజరాత్ ఏటీఎస్ అధికారులు నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 

Published : 20 May 2024 21:39 IST

గాంధీనగర్‌: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. వీరంతా శ్రీలంకకు చెందిన వారుగా అధికారులు భావిస్తున్నారు. వారు అనుమానితులను రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి విచారిస్తున్నట్లుగా జాతీయమీడియా కథనాలు వెలువరించింది.

ఐసీస్‌ అనుమానిత ఉగ్రవాదులు విమానాశ్రయానికి రావడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏమిటనే విషయం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయం అంతటా భద్రతను పెంచారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో మూడు ఐపీఎల్‌ జట్లు విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఇటీవల మార్చిలో భారత్‌లోని ఇద్దరు ఐసిస్ అగ్రనేతలను అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నివాసం ఉంటున్న  ఐఎస్‌ఐఎస్‌ కార్యకర్తలు హరీష్ అజ్మల్ ఫరూఖీ, హర్యానాలోని పానిపట్‌కు చెందిన అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌గా గుర్తించారు. వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, పేలుడు పదార్థాలను సరఫరా చేయడం, ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం వంటి వాటిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అధికారులు తెలిపారు. స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్రకారం వీరిద్దరిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)దిల్లీ, లఖ్‌నవూల్లో పలు కేసులు నమోదు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని