ఇంత భారీ సంఖ్యలో వస్తారని ఊహించలేదు: సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11మంది మృతి చెందిన ఘటనపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పిన సీఎం.. విచారణ కమిషన్‌కు 15 రోజులు గడువు ఇస్తున్నట్లు చెప్పారు.
విజయోత్సవాలకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేదన్నారు. స్టేడియంలో కూర్చొనేంత మంది లేదా ఇంకాస్త ఎక్కువ మంది మాత్రమే వస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ, భారీ సంఖ్యలో తరలివచ్చారన్నారు. స్టేడియం సామర్థ్యం 35వేలు అయితే.. 2లక్షల మందికి పైనే అభిమానులు తరలివచ్చారని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మృతుల్లో ఎక్కువగా యువతే ఉన్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 


