DK Shivakumar: సీఎం లేదా నేను చెబితేనే..: నాయకత్వ మార్పుపై డీకే

Eenadu icon
By National News Team Published : 01 Nov 2025 18:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలతో ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో నవంబరులో సీఎం మార్పు (Karnataka CM) ఉండొచ్చన్న ప్రచారం జోరందుకుంది. ఈ కథనాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) మరోసారి కొట్టిపడేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని నేతలందరూ ఐక్యతతో ఉన్నారని.. ప్రస్తుతానికి తమకు మరో నాయకుడిని వెతకాల్సిన అవసరం లేదని అన్నారు. 

దీనిపై ఏ విషయమైనా సీఎం లేదా తాను చెబితేనే నమ్మాలని..మరెవరి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని.. తప్పుడు వార్తలపై కాదని డీకే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)తో తన అనుబంధం ముందులాగానే కొనసాగుతోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో సీఎం మార్పు విషయంలో వినిపిస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లైంది.

రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే ఆశ తనకు ఉందనేలా డీకే పలుమార్లు పరోక్షంగా బదులిచ్చారు. అయితే, సిద్ధరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్ఠానం భయపడుతోంది. అందుకే.. ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు