Mamata Banerjee: లాలూ ఫ్యామిలీకి కంగ్రాట్స్.. వచ్చి కలుస్తానని తేజస్వీకి మాటిచ్చా: మమత

కోల్‌కతా: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) తండ్రయ్యారు. ఆయన సతీమణి రాజశ్రీ యాదవ్ కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయాన్నే ‘ఎక్స్’ వేదికగా ప్రకటించిన తేజస్వీ యాదవ్.. బేబీతో ఉన్న ఫొటోను షేర్ చేసుకున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి లాలూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ‘ఎక్స్’లో షేర్ చేశారు.

‘‘తేజస్వీ యాదవ్ సతీమణి రాజశ్రీ యాదవ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. వారి ఆనందంలో పాలుపంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఆ దంపతులతో పాటు లాలూ జీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆశీస్సులు. ఈ రోజు వారిని కలవడం ఆనందంగా ఉంది. తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. రాజశ్రీ కోల్‌కతాలో ఉన్న విషయం నాకు తెలుసు. అంతేకాకుండా తేజస్వీ కూడా తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని నిన్న సాయంత్రం తెలిపారు. వస్తానని మాట ఇచ్చి.. ఈరోజు నేను ఆస్పత్రికి వెళ్లి కలిశాను. ఈ చిన్నారి గొప్పగా ఎదిగి ఆ కుటుంబానికి అదృష్టంగా, ఆశాకిరణంగా మారాలని ఆకాంక్షిస్తున్నా’’ అని దీదీ తన పోస్టులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 


