Odisha CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ

ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.

Updated : 11 Jun 2024 18:32 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝీని పేరును కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు అలాగే, కనక్‌ వర్ధన్‌ సింగ్‌ డియో, ప్రవటి పరిదాలకు ఉప ముఖ్యమంత్రులుగా పదవులు దక్కాయి. భువనేశ్వర్‌లో జరిగిన భాజపాఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి భాజపా అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, భూపేందర్‌ యాదవ్‌ హాజరయ్యారు.

రాష్ట్రంలో కమలదళ సీనియర్‌ నేతల్లో ఒకరైన మాఝీ.. ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్‌ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా మోహన్‌ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు.  1997-2000 వరకు సర్పంచ్‌గా పనిచేసిన ఆయన.. 2000లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009, 2019తోపాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. జూన్‌ 12న సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు