Nitish Kumar: మళ్లీ సీఎం కాలేనని నీతీశ్‌కు తెలుసు: విపక్షాల విమర్శలు

Eenadu icon
By National News Team Published : 01 Nov 2025 19:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈసారి బిహార్ (Bihar) ముఖ్యమంత్రి పదవిని తాను చేపట్టలేనని నీతీశ్‌ కుమార్‌కు తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అన్నారు. ‘‘ఆయనకు ఆ విషయం తెలుసు. అందుకే ఆయన ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. ఎన్నికల తర్వాత కొత్త సీఎం ఎవరో తెలుస్తుంది. మ్యానిఫెస్టో విడుదల సమయంలో భాజపా ఆయన్ను అవమానించింది. మహాగఠ్‌బంధన్ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ అని వ్యాఖ్యలు చేశారు. బిహర్‌లో ఎన్డీయే కూటమి శుక్రవారం మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా ఇదే తరహా విమర్శలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించినా నీతీశ్‌ (Nitish Kumar)ను మళ్లీ సీఎం పదవిని చేపట్టనివ్వరని పేర్కొన్నారు. ఆయనను భాజపాలోని గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు హైజాక్‌ చేశారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై పరోక్షంగా విమర్శలు సంధించారు. బిహార్‌ను నియంత్రిస్తోంది వారిద్దరేనంటూ ఆక్షేపించిన సంగతి తెలిసిందే.

నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి (Assembly Election). నీతీశ్ నాయకత్వంలోనే ఎన్నికల వెళ్తామని ప్రధాని మోదీ చెప్పారు. కానీ..ఎన్డీయే గెలిస్తే ఆయనే సీఎం అవుతారా లేదా అనే దానిపై మాత్రం భాజపా నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. ఈ తరుణంలో బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో సామ్రాట్‌కు ఓటు వేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో ఆయన్ను ప్రధాని మోదీ ‘‘బిగ్‌ మ్యాన్‌, వెరీ బిగ్‌ మ్యాన్‌’’ చేస్తారని చెప్పారు. నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)ను తప్పించి, భాజపా అభ్యర్థికి సీఎం బాధ్యతలు అప్పగించేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తోందని విపక్షాలు విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు