Gold: విమానాశ్రయంలో 9 కిలోల బంగారం స్వాధీనం

బెంగళూరులోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వేర్వేరు ఘటనల్లో  9 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   

Updated : 07 Jun 2024 17:14 IST

బెంగళూరు: బెంగళూరులోని విమానాశ్రయాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్‌ అధికారులు 9 కిలోల బంగారాన్ని పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) స్వాధీనం చేసుకున్నట్లుగా గురువారం అధికారులు వెల్లడించారు.

బ్యాంకాక్(Bangkok) నుంచి బెంగళూర్‌(Bengaluru) వస్తున్న విమానంలో అక్రమంగా బంగారాన్ని(gold) తరలిస్తున్నట్లుగా అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో తనిఖీలు నిర్వహించారు. విమానంలోని ఓ మూలలో దాచిన ఓ హ్యాండ్‌ బ్యాగులో రూ.4.77 కోట్ల విలువైన 6.834 కిలోల బంగారు బిస్కెట్లను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  బ్యాగ్‌ లోపల ఉన్న ఆధారాల ద్వారా దానిని విమానంలో వదిలివేసిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో భాగంగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా వారు అంగీకరించారన్నారు.

మరో ఘటనలో బెంగళూరులోని కెంపెగౌడ(Kempegowda) అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్(Dubai) నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో రూ.1.52కోట్ల విలువైన 2.18 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని విమానం ముందు భాగంలోని లావేటరీలో దాచి తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని