Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు జూన్‌ 6 వరకు సిట్ కస్టడీ

హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6 వరకు ఆయన కస్టడీ కొనసాగనుంది. 

Updated : 31 May 2024 17:59 IST

బెంగళూరు: పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు కస్టడీ విధించింది. జూన్‌ 6 వరకు సిట్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ తన నియోజకవర్గం హాసనలో ఎన్నిక ముగియగానే విదేశాలకు వెళ్లిపోయారు. దాంతో అతడిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. స్వదేశానికి వచ్చి విచారణకు సహకరించాలని జేడీఎస్ పెద్దలు దేవెగౌడ, కుమారస్వామి హెచ్చరించిన నేపథ్యంలో.. ఈ రోజు జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన అతడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని కోర్టు ముందు హాజరుపర్చారు. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా.. ప్రస్తుతం కోర్టు అతడికి ఏడు రోజుల కస్టడీ విధించింది.

ఇదిలాఉంటే.. అతడిని అరెస్టు చేసిన సిబ్బంది అంతా మహిళలే కావడం గమనార్హం. ‘‘ఎంపీ పదవిని, పలుకుబడిని అడ్డంపెట్టుకొని మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అందుకే అతడిని అరెస్టు చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాం’’ అని సిట్ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని