PM Modi: శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని మోదీ

Eenadu icon
By National News Team Published : 01 Nov 2025 16:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఛత్తీస్‌గఢ్‌: రాయ్‌పుర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్న చిన్నారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆస్పత్రికి చేరుకున్న మోదీకి.. ‘వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌’ వ్యవస్థాపకులు మధుసూదన్‌ సాయి స్వాగతం పలికారు. సత్యసాయి సంజీవని ఆస్పత్రుల ఛైర్మన్‌ శ్రీనివాసన్‌ ప్రధానికి చిత్రపటాన్ని అందజేశారు.  సత్యసాయి బాబా విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం.. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారులకు ప్రధాని ధ్రువపత్రాలు అందజేశారు. చిన్నారుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధామిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్‌, సత్యసాయి సంజీవని ఆస్పత్రి ట్రస్టీల్లో ఒకరైన సునీల్‌ గవాస్కర్‌ కూడా పాల్గొన్నారు.

వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌లో భాగంగానే ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. ఈ మిషన్‌ వైద్యం, విద్య, పోషకాహార రంగాల్లో వందకు పైగా దేశాల్లో సేవలందిస్తోంది. భారత్‌లోని 25 రాష్ట్రాల్లో 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజూ కోటి మంది ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తోంది. అంతేకాకుండా దేశంలోనే మొట్ట మొదటి ఉచిత ప్రైవేటు వైద్య కళాశాలను కూడా నిర్వహిస్తోంది. ఈ మెడికల్ కాలేజీని ప్రధాని నరేంద్ర మోదీ 2023లో ప్రారంభించారు.

ఉచిత వైద్య కళాశాలతో పాటు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ పేరిట ఓ విశ్వవిద్యాలయం కూడా ఉంది. అంతేకాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో 6వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యంగా అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు పోషకారాన్ని అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని