MEA: అదానీపై ఆరోపణల వ్యవహారం.. విదేశాంగ శాఖ ఏమన్నదంటే!

దిల్లీ: అదానీ సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అది ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులతోపాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారమని పేర్కొంది. వీటికి సంబంధించి అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ముందస్తుగా ఎటువంటి సమాచారం రాలేదని స్పష్టం చేసింది.
‘‘ప్రైవేటు వ్యక్తులు, అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారం. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. అవి వాటిని అనుసరిస్తాయని విశ్వసిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. అదానీ కేసులో భారత్‌కు అమెరికా సమన్లు లేదా వారెంటు ఇచ్చిందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌కు అటువంటి విజ్ఞప్తి ఏదీ రాలేదన్నారు.
బంగ్లాలో పరిస్థితులపై ఆందోళన..
బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతోన్న దాడులపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేని స్పష్టం చేసింది.
‘‘తీవ్రవాద భావజాలంతో రెచ్చగొట్టే చర్యలు, హింసాత్మక ఘటనలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా హిందువులతోపాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతోన్న దాడులు, బెదిరింపు ఘటనలపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే మా ఆందోళన తెలియజేశాం. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. మైనారిటీలందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉంది’’ అని రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఇస్కాన్‌ను నిషేధించాలని చేస్తున్న వాదనలపై స్పందిస్తూ.. సామాజిక సేవలో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌కు మంచి గుర్తింపు ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 


