Sambit Patra: నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు

భాజపా సీనియర్ నేత నోరుజారి ఇరకాటంలో పడ్డారు. తాను చేసిన పొరపాటుకు ప్రతిగా ఉపవాసం చేస్తానని చెప్పారు. 

Updated : 21 May 2024 10:27 IST

దిల్లీ: ఒడిశా(Odisha)లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేత సంబిత్‌ పాత్ర (Sambit Patra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అది అనుకోకుండా జరిగిందని, దానికి ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘నేను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రధాని మోదీ రోడ్‌షో తర్వాత పలు మీడియా ఛానెళ్లతో మాట్లాడాను. అన్నిచోట్ల మోదీ.. పూరీ జగన్నాథుడికి పరమభక్తుడు అని చెప్పాను. కానీ మరోచోట మాట్లాడుతూ అందుకు విరుద్ధంగా స్పందించాను. అది అనుకోకుండా జరిగిన తప్పు. కానీ ఇది కొందరిని బాధించి ఉంటుంది. దేవుడు కూడా అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. నోరు జారినందుకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అంటూ సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.

భాజపా నేత వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. ‘‘జగన్నాథుడు విశ్వానికి ప్రభువు. ఆయన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది’’ అంటూ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇతర ప్రతిపక్ష నేతలు కూడా సంబిత్‌పై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని