EC: అమిత్‌షాపై ఆరోపణలు.. జైరాం రమేష్‌కు ఈసీ నోటీసులు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తగిన ఆధారాలు సమర్పించాలని ఈసీ ఆదేశించింది.

Published : 02 Jun 2024 20:26 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh)ను ఎన్నికల సంఘం(EC) ఆదివారం ఆదేశించింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్‌లకు ఫోన్‌ చేశారని జైరాం రమేష్‌ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది.

"మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఒక జాతీయ పార్టీలో సీనియర్ నాయకులు. మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు సమర్పించండి. కౌంటింగ్‌కు ముందు 150మంది జిల్లా కలెక్టర్లకు హోం మంత్రి ఫోన్‌కాల్స్‌ చేశారనడానికి తగిన ఆధారాలను ఇవ్వండి. తద్వారా తగిన చర్యలు తీసుకుంటాం” అని ఈసీ తన లేఖలో పేర్కొంది.

‘‘హోంమంత్రి ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై నిఘా పెట్టారు. బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల భాజపా ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా అర్థమవుతోంది. ప్రజల అభీష్టమే గెలుస్తుంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది’’ అని జైరాం రమేష్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు