Karnataka: ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశం.. డీకే దూరం..!

ఇంటర్నెట్‌డెస్క్: కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో మరో పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సమావేశం కానున్నారు. అయితే, ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నట్లు ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధుల కేటాయింపునకు సంబంధించి ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య విధానసౌధలో సమావేశం కానున్నారు. దీనికి డీకే దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇది తమను ఎంతో ఆందోళనకు గురిచేస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కాగా.. శివకుమార్ ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండటం ఇదేం కొత్త కాదని అధికారిక వర్గాలు తెలిపాయి. గత పదవీకాలంలో కూడా పలు భేటీలకు ఆయన హాజరుకాలేదని వెల్లడించాయి.
ఇక, డీకే ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, అందుకే ఆయన సమావేశానికి హాజరుకాలేకపోతున్నారని మరికొందరు తెలిపారు. మరోవైపు.. ఇలాంటి సమావేశాలు సాధారణంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యాలయాల్లో జరుగుతాయి. అయితే, ఈసారి విధానసౌధలో సీఎం ఛాంబర్‌లో ఈ భేటీ జరగనుండటం చర్చనీయాంశమైంది. డీకేను దూరం పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా నిర్వహించాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. వీటన్నింటిపై మౌనంగా ఉన్న శివకుమార్ తన కార్యకలాపాల్లో మునిగిపోయారు.
కొద్దిరోజులుగా కర్ణాటక రాజకీయాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటినుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాన్నే విశ్వసిస్తున్నారు. దీనిపైనే ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, అగ్ర నాయకులు వాటిని తోసిపుచ్చారు. ఐదేళ్లూ తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య కూడా స్పష్టంచేశారు. అనంతరం డీకే మాట్లాడుతూ.. తాను సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందులో తప్పులేదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 - 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 


