Kejriwal: ‘నన్ను అవమానించడమే వారి ఏకైక లక్ష్యం’: దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌

తనను అవమానించడమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏకైక లక్ష్యమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Updated : 03 Apr 2024 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడంపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మండిపడ్డారు. తనను అవమానించడమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఏకైక లక్ష్యమన్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు తనను నిరోధించడమే వారి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఆయన.. మధ్యంతర ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం బుధవారం విచారించింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రం ఛౌదరీలు వాదనలు వినిపించారు. దిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన సమయం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఈడీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు