Pune car crash: పుణె కారు ఘటన.. బాలుడి రక్త నమూనా స్థానంలో తల్లిది తీసుకొని..!

పుణె కారు ప్రమాద ఘటన (Pune Car Crash)లో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం ఆనవాళ్లు పరీక్షించేందుకు బ్లడ్‌టెస్ట్‌ నిమిత్తం ప్రధాన నిందితుడి తల్లి రక్త నమూనాలు ఉపయోగించినట్లు సమాచారం. 

Published : 30 May 2024 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ (Pune Car Crash) కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను వైద్యులు మార్చేసినట్లు ఇదివరకు వెల్లడైన సంగతి తెలిసిందే. దానిని తన తల్లి రక్త నమూనాతో మార్చివేసినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ శ్రీహరి హల్నోర్‌ వాటిని తీసుకున్నట్లు తెలిపాయి.

నిందితుడి రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ శ్రీహరి హల్నోర్‌పై వేటుపడింది. సాసూన్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి తొలగించారు. అతడిని సర్వీసు నుంచి పూర్తిగా డిస్మిస్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చి ఆఫ్‌ మహారాష్ట్ర ప్రకటించింది. దీంతోపాటు ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డేపైనా సస్పెన్షన్‌ వేటు వేసింది. హల్నోర్‌, తావ్‌డేతో పాటు ఒక గుమస్తాను పోలీసులు అరెస్టు చేశారు. బ్లడ్‌ టెస్ట్ జరిగినప్పుడు మైనర్ తల్లి ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్య సిబ్బంది అరెస్టు తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకోసం గాలిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని