Viral news: గుండు గీసి.. హిజ్రాల పాశవిక చర్య

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదుగురు హిజ్రాలు పాశవిక చర్యకు పాల్పడ్డారు. ఓ వ్యక్తికి గుండు గీసి, అతడితో మూత్రం తాగించారు.

Published : 29 Jul 2023 18:35 IST

లఖ్‌నవూ: మధ్యప్రదేశ్‌లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోసిన ఘటనను మరువక ముందే అదే తరహా పాశవిక చర్య మరోసారి పునరావృతమైంది. ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండుగీసి అతడిపై మూత్ర విసర్జన చేశారు. అంతటితో ఆగకుండా భౌతిక దాడికి పాల్పడ్డారు. అక్కడికి దూరంగా పని చేస్తున్న కొందరు అది గమనించి హిజ్రాల దాడి నుంచి వ్యక్తిని రక్షించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) కోస్‌గంజ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ఐదుగుర్నీ అరెస్టు చేశారు.

RTI దరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లయ్‌.. ఎస్‌యూవీలో ఇంటికి!

రెండు హిజ్రా వర్గాల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. బాధితుడు రఫీకుల్‌ ఓ వర్గానికి చెందిన నాయకురాలి ఇంట్లో వంటవాడిగా పని చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం వ్యక్తిగత పని మీద రఫీకుల్‌ వెళ్తున్న సమయంలో ఐదుగురు హిజ్రాలు అతడిని అడ్డగించి దుర్భాషలాడారు. అతడి దగ్గరున్న రూ.1000 నగదును లాక్కున్నారు. ఆ తర్వాత అతడికి ఒకరు గుండు గీస్తుండగా.. మిగతావారంతా చుట్టూ చేరి వీడియో తీశారు. అతడి ముఖంపైన, నోట్లో మూత్ర విసర్జన చేశారు. రఫీకుల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూత్రవిసర్జన చేసిన తర్వాత తనను కూడా హిజ్రాగా మార్చేందుకు వాళ్లు ప్రయత్నించారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. హిజ్రాల పాశవిక చర్యను పలువురు ఖండిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని