Aadhaar: పదేళ్లయిందా...తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందే: UIDAI
ఆధార్ తీసుకొని పదేళ్లయినా ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని వాళ్లు తప్పనిసరిగా కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది.
దిల్లీ: పదేళ్లనుంచి ఒక్కసారి కూడా ఆధార్ అప్‌డేట్ (Adhar Update) చేయనివారు కార్డుకుసంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికారసంస్థ (UIDAI) మరోసారి కోరింది. పోటీ పరీక్షలు రాయాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, వేరే దేశం ప్రయాణించాలన్నా, ఆఖరికి చిన్నపిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ లేని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సేవలు దాదాపుగా పొందలేకపోతున్నారు. ఈ కార్డు ప్రజల జీవితంలో ముఖ్య అవసరంగా మారిపోయింది. ఎంతలా అంటే ఆధార్ లేని వ్యక్తికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు.
ఆధార్‌ను పదేళ్లకు ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలని కార్డు దారులను యూఐడీఏఐ కోరింది. దీనికోసం గత నెలలోనే ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆప్‌డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చని, లేదా తమ వద్దనున్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్ అప్‌డేట్.. సులభంగా సేవలు పొందటానికి మరింత సహాయ పడుతుందని తెలిపింది.
గత కొన్నేళ్లుగా.. ఆధార్ దాదాపు తప్పని సరి అయిపోయింది. 1,100పైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ సంఖ్య ఆధారంగానే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 134 కోట్ల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న చిరునామాతో ప్రతి ఒక్కరూ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. దీనికోసం నవంబరు 9న ఆధార్ నిబంధనలు సవరించి పదేళ్లకోసారి అప్‌డేట్ తప్పనిసరి చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు