Rahul gandhi: మోదీ విమర్శలపై రాహుల్ గాంధీ క్లారిటీ

తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టత ఇచ్చారు. 

Updated : 17 Apr 2024 18:11 IST

దిల్లీ: తాను చేసిన ‘పేదరికం’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వివరణ ఇచ్చారు.  ప్రధాని మోదీ (Modi) విమర్శలు చేయడంతో రాహుల్ నుంచి స్పందన వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే..?

ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి ఖాతాల్లో ప్రతీ ఏటా రూ.లక్ష వస్తూనే ఉంటుంది. చిటికెలో భారత్‌ నుంచి పేదరికాన్ని తొలగిస్తాం’’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోదీ చెణుకులు విసిరారు. ‘‘ఒక్క వేటుతో పేదరికాన్ని మాయం చేసే రాజ మాంత్రికుడు’’ అంటూ అభివర్ణించారు. ‘‘ఇన్నేళ్లుగా ఈ రాకుమారుడు ఎక్కడ ఉన్నారు? ఆయన నాన్నమ్మ (ఇందిరా గాంధీ) 50 ఏళ్ల క్రితమే గరీబీ హఠావో నినాదం ఇచ్చిన విషయం ప్రజలకు తెలుసు’’ అంటూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే చురకలు వేశారు. ఈ క్రమంలో రాహుల్‌ నుంచి స్పందన వచ్చింది. ‘‘ఒకే దెబ్బకు దారిద్ర్యం తొలగిపోతుందని ఎవరూ చెప్పలేదు. కానీ అధికారంలోకి వస్తే మేము ఆ దిశగా మెరుగైన చర్యలు తీసుకోగలం’’ అంటూ తనపై వచ్చిన విమర్శలకు స్పష్టత ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని