WhatsApp Down: వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం

సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌ (Whatsapp), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సేవలకు  ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది.

Published : 04 Apr 2024 01:29 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌ (Whatsapp), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి 11:45 గంటల నుంచి వీటి సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. వారంతా హైరానా పడ్డారు. మొబైల్‌ యాప్‌ నుంచి మెసేజ్‌లు పంపిస్తే సెండ్‌ అవ్వడం లేదు. అలాగే వెబ్‌ వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే నెట్‌వర్క్‌ అందుబాటులో లేదు అని చూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారుల తమ ఫీడ్‌ను రీఫ్రెష్‌ చేయలేకపోయారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌, ట్విటర్‌లో వాట్సాప్‌ సేవల అంతరాయంపై వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన వాట్సాప్‌.. సాధ్యమైనంత తొందర్లోనే సేవలను పునరుద్ధరిస్తామని ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని