Tejashwi Yadav: ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం - తేజస్వీ యాదవ్ హామీ

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Polls) షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాము (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) హామీ ఇచ్చారు. పట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపే ఇందుకు సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు.
‘‘20 ఏళ్లలో రాష్ట్ర యువతకు ఎన్డీయే ఉద్యోగాలు కల్పించలేకపోయింది. మేం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకువస్తాం. 20 నెలల్లోనే దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలపై హామీ ఇచ్చాను. నేను అధికారంలో ఉన్న ఆ కొద్ది కాలంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించా. నాకు ఐదేళ్ల సమయం ఉంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తోనో మీరే ఊహించుకోవచ్చు’’ అని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ను కాపీక్యాట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా చేపడుతున్న కార్యక్రమాలు గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను పోలిఉన్నాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు సోమవారం టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో దర్యాప్తు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. - 
                                    
                                        
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
Darshan: అభిమాని హత్యకేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. - 
                                    
                                        

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
Digital Arrests: డిజిటల్ అరెస్టులపై జరిపిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. - 
                                    
                                        

‘అనవసర అంశాలపైనే ప్రసంగాలు’.. ప్రధానిపై ప్రియాంక గాంధీ విసుర్లు!
దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలందరిపై ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ
PM Modi: మహిళజట్టు వన్డే ప్రపంచకప్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. - 
                                    
                                        

మీకు హైకమాండ్ చెప్పిందా: సీఎం మార్పుపై సిద్ధరామయ్య
నాయకత్వ మార్పుపై ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతారని.. వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. - 
                                    
                                        

భారత్ టెక్ పవర్‌హౌస్‌గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. - 
                                    
                                        

బిహార్‌లో గెలుస్తాం.. 18న ప్రమాణం చేస్తాం
బిహార్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ పునరుద్ఘాటించారు. - 
                                    
                                        

హత్యలు, అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వశాఖలు
బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఒకవేళ ఇండియా కూటమికి వస్తే.. హత్యలు, అపహరణలు, దోపిడీలకు మూడు మంత్రిత్వ శాఖలను తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర ఆరోపణ చేశారు. - 
                                    
                                        

దిల్లీ గాలి కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోండి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. - 
                                    
                                        

దేశాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం అవసరం
మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మహిళల భాగస్వామ్యంతో పాటు అందరి సమష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. - 
                                    
                                        

వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్‌గా మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రధాని మోదీ భయపడిపోతారని.. ఆయన బడా వ్యాపారవేత్తల చేతి రిమోట్ కంట్రోల్లాంటివారని లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. - 
                                    
                                        

పహల్గాంలో కేబుల్ కార్ పనులకు ఎన్ఐయే సుముఖత
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో కేబుల్ కార్ ప్రాజెక్టు చేపట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐయే) ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి తెలిపింది. - 
                                    
                                        

కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించింది
బిహార్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. - 
                                    
                                        

పెయింట్ ది సిటీతో ధంతరీ సుందరీకరణ
ఈటీవీ భారత్: ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరీ నగరంలో జిల్లా అధికార యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషను సిబ్బంది ‘పెయింట్ ది సిటీ’ పేరుతో వినూత్న సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. - 
                                    
                                        

బీసీఏ పట్టభద్రుడి బండి.. తందూరీ సమోసావాలా!
బీసీఏ చదివి ప్రోగ్రామింగులో ప్రత్యేక శిక్షణ పొందిన మనేశ్వర్ చేస్తున్న ఉద్యోగం వదిలి సమోసావాలాగా మారారు. - 
                                    
                                        

మహాత్ముడి బాటలో.. ఊరు ఊరంతా శాకాహారులే
ఝార్ఖండ్‌లోని లాతెహార్ జిల్లా బార్వాగఢ గ్రామంలో అందరూ శాకాహారులే. వీరిలో ఎక్కువమంది తానా భగత్ సమాజానికి చెందినవారు. - 
                                    
                                        

క్లిష్ట పరిస్థితులు.. మీ పాలిట వరాలు
అడ్డంకులు మీ నిబద్ధతను పరీక్షిస్తాయి. వైఫల్యాలు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి అవసరమైన విలువైన సూచనలు అందిస్తాయి. - 
                                    
                                        

46 నుంచి 38కి తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య
దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1నాటికి 46గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా సమీక్షలో పేర్కొంది. - 
                                    
                                        

భళా.. బాహుబలి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బాహుబలి రాకెట్‌గా పేరొందిన ‘ఎల్వీఎం3-ఎం5’ వాహకనౌక ద్వారా ఇది నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు: శశిథరూర్
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 


