Yesudas: ఏసుదాసు కుమారుడి నివాసంలో భారీ చోరీ
గాయకుడు విజయ్ ఏసుదాసు నివాసంలో భారీ చోరీ జరిగింది. బంగారం, వజ్రాభరణాలు అపహరణకు గురయ్యాయి.
చెన్నై: ప్రముఖ గాయకుడు ఏసుదాసు (Yesudas) కుమారుడు, యువ సింగర్ విజయ్ ఏసుదాసు (Vijay Yesudas) నివాసంలో భారీ చోరీ జరిగింది. 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయంటూ ఆయన చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే సిబ్బందిపై అనుమానం ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య నివాసంలోనూ ఇటీవల బంగారం, వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె ఇంట్లో పనిచేసే ఈశ్వరీ అనే మహిళను అరెస్ట్ చేయగా.. జీతం సరిపోకపోవడం వల్లే తాను చోరీలకు పాల్పడినట్లు తెలిపింది. ఐశ్వర్య నివాసంలో జరిగిన దొంగతనాన్ని మర్చిపోకముందే విజయ్ ఏసుదాసు నివాసంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం