Aamir Khan: ‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘పాపా కహ్తే హై..’ అంటూ సాగే గీతాన్ని అగ్రకథానాయకుడు ఆమిర్ ఖాన్ విడుదల చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ అనే చిత్రంలోని ఈ పాటను రీమేక్ చేసి ‘పాపా కహ్తే హై 2.0’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శ్రీకాంత్ చిన్ననాటి నుంచే ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడో చూపిస్తూ సాగుతున్న ఈ గీతం సినీప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ..‘‘నా జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రంలోని గీతమిది. ఈ ప్రాజెక్టు తొలినాళ్లలో మేమంతా ఇండస్ట్రీకి కొత్తవాళ్లం. నేను, దర్శకుడు మన్సూర్ ఎప్పుడూ ఈ సినిమా చూసిన కేవలం లోపాలను మాత్రమే వెతికేవాళ్లం. ఇంకా మెరుగ్గా సన్నివేశాల్ని ఎలా తీర్చిదిద్దాలి అనే చర్చ జరిగేది. ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారోనని భయంగా ఉండేది. కానీ.. మర్చిపోలేని బహుమతి ఇస్తుందని ఊహించలేదు. నా జీవితంలో ఎప్పటికీ ఒక మైలు రాయిలాంటి చిత్రం ‘ఖయామత్ సే ఖయామత్ తక్’’ అని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్