Bollywood: శునకంతో పోల్చుతూ ట్రోల్‌ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో

తనపై వచ్చిన ట్రోల్స్‌ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్‌ హీరో ఆయుష్‌ శర్మ చెప్పారు. 

Published : 25 Apr 2024 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘రుస్లాన్’ (Ruslaan). కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో వరుస ప్రమోషన్‌లలో పాల్గొంటున్నారు ఆయుష్‌. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

‘‘లవ్‌ యాత్రి’తో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ చిత్రానికి బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా తర్వాత నాపై దారుణమైన ట్రోల్స్‌ వచ్చాయి. ఎన్నో విషయాలను ఎదుర్కొన్నాను. నన్ను శునకంతో పోలుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా పిల్లలు నా గురించి ఇంటర్నెట్‌లో వెతకగానే అవే కనిపించాయి. చాలా బాధపడ్డారు. సల్మాన్‌ నా బదులు ఒక శునకాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసినా బాగుండేదని నెటిజన్లు కామెంట్స్‌ పెట్టారు. కానీ, అలా పెట్టినవారికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వాళ్ల వల్లే నాలో పట్టుదల పెరిగింది. నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నా’ అని చెప్పారు.  ఇటీవల కూడా ఆయుష్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు. దాదాపు 300 చిత్రాలకు ఆడిషన్స్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే మాటను సల్మాన్‌తో చెబితే ఆయనకు నటనలో శిక్షణ ఇప్పించి.. ‘లవ్‌యాత్రి’లో అవకాశం ఇప్పించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు