Abraham Ozler: మలయాళంలో రూ.40కోట్లు వసూలు చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఓటీటీలో వచ్చేస్తోంది

Abraham Ozler: సంక్రాంతి సందర్భంగా విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అబ్రహాం ఓజ్లర్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Published : 01 Mar 2024 19:57 IST

హైదరాబాద్‌: జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మాన్యువల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇదీ కథ: అబ్ర‌హం ఓజ్ల‌ర్ (జ‌య‌రాం) ఐపీఎస్‌ ఆఫీసర్‌. అతని భార్యాపిల్ల‌లు కనిపించకుండా పోతారు. ఈ క్రమంలో వరుస హ‌త్య‌లు జరుగుతాయి. ఆ మృతదేహాల వద్ద హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ ర‌క్తంతో రాసి ఉన్న కాగితాలు దొరుకుతుంటాయి. ఆ హ‌త్య‌ల వెన‌కున్న ట్విస్ట్‌ను ఓజ్ల‌ర్ ఎలా ఛేదించాడు? అలెక్స్ (మ‌మ్ముట్టి) ఎవరు? అతనికి ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌. ఐపీఎస్‌ ఆఫీసర్‌ అబ్రహాం ఓజ్లర్‌గా జ‌య‌రాం నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని