డ్రగ్స్ కేసు.. అనుమానాస్పద స్థితిలో నటుడి మృతి..!

ప్రముఖ నటుడు లీ సన్‌-క్యూన్‌( Lee Sun-kyun) మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated : 27 Dec 2023 12:49 IST

సియోల్‌: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘పారాసైట్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దక్షిణ కొరియా నటుడు లీ సన్‌-క్యూన్‌( Lee Sun-kyun) అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొన్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లోని పార్క్‌లో నిలిపి ఉంచిన వాహనంలో ఆయన ఆపస్మారక స్థితిలో ఉండగా గుర్తించారు. ఆయన రాసినట్లు భావిస్తున్న ఒక సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

దక్షిణ కొరియాకు చెందిన లీ సన్‌-క్యూన్‌ వయస్సు 48 సంవత్సరాలు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రఖ్యాత కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత 2001లో ‘లవర్స్‌’ అనే టీవీ షో ద్వారా తెరంగేట్రం చేశారు. ‘పారాసైట్‌’లో సంపన్నుడిగా నటించారు. 2019లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాలను గెలుచుకుంది. లీ చివరగా ఈ ఏడాది ‘స్లీప్‌’ చిత్రంలో మెరిశారు. డ్రగ్స్ వాడిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. నటుడిగా ఎందరో అభిమానాన్ని చూరగొన్న ఆయన.. ఈ కేసు కారణంగా పలు ప్రాజెక్టులను కోల్పోయినట్లు సమాచారం.

అక్టోబర్‌లో డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా పోలీసు స్టేషన్‌కు వచ్చిన లీ సన్‌-క్యూన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న నా కుటుంబానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. అక్రమంగా డగ్స్‌ వినియోగించడాన్ని దక్షిణ కొరియాలో తీవ్రంగా పరిగణిస్తారు. విదేశాల్లో చట్టబద్ధంగా గంజాయి తీసుకున్నా సరే.. స్వదేశానికి వచ్చిన తర్వాత విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని