Naresh: డిప్రెషన్‌ నుంచి గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌లోకి..: నరేశ్‌ పోస్ట్‌ వైరల్‌

తన కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్‌ చేశారు నటుడు నరేశ్‌ (Naresh).

Published : 29 Nov 2023 18:09 IST

హైదరాబాద్‌: తన సినీ కెరీర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు నరేశ్‌ (Naresh). జీవితంలో ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు గురయ్యానని అన్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, కష్టకాలంలో ఉన్నప్పుడు ఓ పాట తనలో స్ఫూర్తి నింపిందని తెలిపారు.

‘‘కెరీర్‌లో పరాజయాలు.. ఆర్థిక ఇబ్బందులు.. ప్రియమైన వారిని కోల్పోవడం.. ఇలా  జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పాట నాలో స్ఫూర్తి నింపింది. బంధువులు హేళన చేసి నన్నొక జోకర్‌లా చూసినప్పుడు మా అమ్మ, స్నేహితుడు విజయ్ వాధ్వా నాకెంతో అండగా నిలిచారు. నేను పవర్‌ఫుల్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు ఈ పాట ఉపయోగపడింది. ఇప్పటికీ అది నన్నెంతో ప్రభావితం చేస్తోంది. ఒక నటుడిగా ఇది నా 50వ వసంతం. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాకెంతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని నరేశ్‌ ట్వీట్‌ చేశారు. నటి పవిత్రా లోకేశ్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. 2003, 2023 సంవత్సరాల్లో దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘డిప్రెషన్‌ పీరియడ్‌.. గోల్డెన్‌ జూబ్లీ ఇయర్‌’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని